Sunday, 26 July 2026 11:54:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన మీడియా అకాడమీ...

Date : 24 August 2023 01:52 AM Views : 181

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి 96 జర్నలిస్టు కుటుంబాలకు, బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోటల్ టూరిజం ప్లాజాలో చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు "సంక్షేమ నిధి -పాత్రికేయుల పెన్నిధి" పేరిట ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు, పని చేయలేని, నిస్సహాయ స్థితిలో ఉన్న జర్నలిస్టులకు, ప్రభుత్వం ఏర్పరచిన 42 కోట్ల జర్నలిస్టుల సంక్షేమ నిధి మూలధనంపై వచ్చిన వడ్డీతో మీడియా అకాడమీ చెక్కుల పంపిణీ చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు మీడియా అకాడమీ ఈ నిధి ద్వారా మొత్తం 19,01,21,000 రూపాయల ఆర్థిక సహాయం జర్నలిస్టులకు సహాయం అందగా, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబానికి లక్ష రూపాయలతో పాటు, ఐదు సంవత్సరాలవరకు నెలకు 3000 పెన్షన్ అందజేస్తున్నట్టు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలు ఎల్‌కే‌జీ నుండి 10వ తరగతి వరకు చదువుకోవడానికి ట్యూషన్ ఫీజ్ కొరకు ఒక్కక్కరికి నెలకు 1000 రూపాయలు అకాడమీ అందజేస్తుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జర్నలిస్టులుగా పని చేస్తూ గత ఏడాది మృతి చెందిన ఏబీఎన్ రాజు, ఆంధ్రప్రభ సూర్యం, భద్రాచలం కు చెందిన మోహన్, పాల్వంచకు చెందిన ఫిరోజ్ కుటుంబాలకు టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టియుడబ్ల్యూజె (టిజెఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మారుతి సాగర్ ల చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఆలస్యంగా దరఖాస్తులు అందించిన మరికొంతమందికి మరో విడతలో చెక్కులు పంపిణి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్, టెంజూ జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, ఐజేయూ సభ్యులు చండ్ర నరసింహారావు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :