సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొలువులు లేక నిరాశతో ఉన్న యువతకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగ నియమకాలను పూర్తి చేస్తున్న సందర్భంలో తెలంగాణ గవర్నమెంట్ గురుకుల బోర్డులో పి జి టి తెలుగు టీచర్ గా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన నాగస్పందన W/o కాసార్ల ఉపేందర్ నిన్న ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే వారికి ఉద్యోగం వచ్చిందనే భావనతో పార్టీని నమ్ముకొని ఉన్న మీలాంటివారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని అధికారం లోకి తీసుకురావడం కోసం కష్టపడి పనిచేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు మాలాంటి వారికి ఉద్యోగాలు వస్తున్నాయన్న సంతోషాన్ని వ్యక్త పరుస్తూ హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని కలిసి స్వీటు ఇచ్చి వారి ఆనందాన్ని సంతోషాన్ని పంచుకున్నారు...
-----------------------
Admin