సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గల ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపహాడ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా నూతన బ్రోచర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డొంకణ చంద్రశేఖర్ కమిటీ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కుమార్ చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదిలా ఉంటూ అక్రమాలను వెలికి తీయాలని తెలిపారు. పాత్రికేయులు రాసే ప్రతి వార్త ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని అందుకు పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు...
-----------------------
Admin