Sunday, 26 July 2026 08:18:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేశవ్యాప్త కార్మికుల సమ్మె...

Date : 17 February 2024 09:42 AM Views : 203

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : కేంద్ర ప్రభుత్వ నియంత్రృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని కార్మిక, కర్షకులకు పిలుపునిచ్చారు... దేశవ్యాప్త కార్మికుల సమ్మె , గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా మక్తల్ పట్టణంలో కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఐ ఎఫ్ టి యూ జిల్లా ఉపాధ్యక్షులు ఏజీ భుట్టో అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు యస్ కిరణ్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు భగవంతు,ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి కొలిమి రాములు, సిఐటియు జిల్లా నాయకులు గోవిందురాజు, పి ఓ డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు శారద, పి డి యస్ యు ఉపాధ్యక్షులు బి భాస్కర్, పి డి యస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు సంధ్య, సి ఐ టి యు నాయకులు కర్రెం క్రిష్ణ తదితరులు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక, మతతత్వ విధానాల ఫలితంగా ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరిగిపోతున్నది, ఆక్సోపాం నివేదిక ప్రకారం దేశంలో 80 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన మగ్గిపోతున్నారు 2024 ఏప్రిల్ లో రాబోతున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి రాయితీలను ప్రకటిస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. చరిత్రత్మకమైన రైతన్న పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ రైతులకు రాతపూర్వకంగా హామీలు ఇచ్చింది. ఈ కాలములో వాటిని అమలు చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టెందుకు పూనుకున్నది అన్నారు. భారతదేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని బడా కార్పొరేట్ దారులకు కట్టు బానిసలుగా మార్చేటటువంటి నాలుగు లేబర్ కోడ్లలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది. కార్మికుల వేతనాలు రోజురోజుకి దిగజారి పోతున్నాయని అన్నారు. కార్మిక వర్గం యొక్క కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల దేశము యొక్క ఆర్థిక పురోగతి మందగించిందని అన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నివసిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ మరియు విద్యుత్ బిల్లు  రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు వాటాలు అమ్మడం ప్రైవేట్ పరాం చేయడం ఆపాలని కాంట్రాక్టు విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం శాఖలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేయాలనే డిమాండ్స్ తో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాల అసంఘటితరంగంలో కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమును ప్రవేశపెట్టాలి అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, ఐకెపి, ఫీల్డ్ అసిస్టెంట్, కస్తూరిబా,ఎన్నారై స్కీం వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనం చెల్లించాలని వారిని ప్రభుత్వం ఉద్యోగుల గుర్తించాలని దేశవ్యాప్తంగా జరుగుతునా సమ్మె లో కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా దరల పెరుగుదలను అరికట్టాలని ఆహార వస్తువులు మరియు నిత్యవసర వస్తువులపై జిఎస్టిని ఉపసంహరించుకోవాలని పెట్రోల్ డీజిల్ కిరోసిని వంట గ్యాస్ పై కేంద్రం ఎక్స్చేంజ్ కానీ తగ్గించాలని భవన నిర్మాణ కార్మికులకు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ని పెంచాలని తదితర డిమాండ్ తో  గ్రామీణ ప్రాంత  బంద్ లో రైతులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగన్న, ఆశన్న,రవి,బండారి బాలు,జి కృష్ణయ్య, మహేశ్వరమ్మ, శంకరమ్మ, సుజాత, ఆకాశ్, హన్మంతు, రామలింగం, వెంకటేష్,డి నర్సింలు, బండారి మల్లేష్, మారుతి, మారెప్ప జగ్గలి బాబు, జగ్గలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: