Monday, 27 July 2026 02:40:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పార్టీ నేతల వెన్నుపోటుతో స్వతంత్రంగా బరిలోకి కూస సరిత సుదర్శన్ పటేల్

Date : 09 December 2025 12:37 PM Views : 338

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రామాభివృద్ధి తమ లక్ష్యం కూస సరిత సుదర్శన్ పటేల్.. చెన్నరావుపేట మండలం ఖాదర్‌పేట గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కూస సరిత సుదర్శన్ పటేల్ తమపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు చేస్తున్న అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చారు.చాలాకాలంగా కాంగ్రెస్‌లో పనిచేస్తూ గ్రామానికి, పార్టీకి సేవలు అందించిన తమ కుటుంబానికి అర్హత ఉన్నా,అంతర్గత రాజకీయాల వల్ల అభ్యర్థిత్వం దక్కలేదని సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా భార్య సరితకు పార్టీ టికెట్ ఖాయమనే నమ్మకం. కానీ కొందరు నేతల కుట్రలతో ఆ అవకాశం పోయింది” అని తెలిపారు.గత రెండు ఎన్నికల్లో కూడా తమ సొంత పార్టీలోనే కొందరు నేతలు వెన్నుపోటు, బ్లాక్‌మెయిల్ చేసి ఆర్థిక నష్టం కలిగించారని ఆరోపించారు. “నా ఎదుగుదల ఇష్టం లేని కొందరు నేతలు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నా గురించి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. దీంతో నాపై తప్పు అభిప్రాయాలు పెరిగాయి” అని చెప్పారు. ఈసారి ఏ మాత్రం వెనుకడుగు వేయనని స్పష్టం చేసిన సుదర్శన్, గ్రామ ప్రజల మద్ధతుతో తన సతీమణి కూస సరిత ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దింపినట్లు తెలిపారు. “నామినేషన్ వేసిన రోజు నుంచే ఉపసంహరణకు ఒత్తిడులు వస్తున్నాయి.కానీ నేను వెనుదిరిగే ప్రసక్తే లేదు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలే నాకు బలం” అని దృఢంగా చెప్పారు.తమనిపై జరుగుతున్న రాజకీయ ఒత్తిడులు విచారకరమని, ప్రజా మద్దతుతో సరిత ను గెలిపించడం తమ లక్ష్యమని కూస సుదర్శన్ పటేల్ స్పష్టం చేశారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :