సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (సింగరేణి ) : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం సింగరేణి ప్రాంతంలో గత రెండు సంవత్సరాల క్రితమే మంజూరై పనులు ప్రారంభించకుండా పెండింగ్లో ఉన్న తార్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టి కార్మిక ప్రాంత ప్రజలను రోడ్డు ప్రమాదాల బారి నుండి కాపాడాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ సింగరేణి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం వార్డులో వర్షాల కారణంగా గుంటలు పడ్డ రోడ్లను ఆమె పరిశీలించి మాట్లాడుతూ గత పది రోజుల నుండి భారీగా కురిసిన వర్షాల కారణంగా గతం కంటే ఇంకా రామవరం ప్రధాన కూడలి రోడ్లు లక్ష్మీ టాకీస్ పోయే దారి ,నాగయ్య గడ్డ ,బర్మా క్యాంపు, ఇతర ప్రాంతాలకు పోయే రోడ్లన్నీ గుంటలమయమయ్యాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు సింగరేణిలో విధులకు వెళ్లే కార్మికులు ,విద్యాలయాలకువెల్లె విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారనిఅన్నారు. రామవరం ప్రధాన కూడళ్లను కలిపే రహదారులన్నింటికీ సింగరేణి ఆధ్వర్యంలో సుమారు కోటి 40 లక్షలకు టెండర్లు పిలిచామని అధికారులు రెండు సంవత్సరాలు నుండి చెపుతూనే ఉన్నారు తప్ప రోడ్లు నిర్మాణం చేపట్టింది లేదని అధికారులు కార్మిక ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆమె సింగరేణి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు బస్తీ సీనియర్ సిటిజన్ ఎండి గౌస్ మెకానిక్ సాయి, ఎండి పాషా, సరస్వతి ,కమలాదేవి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin