సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : వైఎస్ షర్మిల అక్రమ అరెస్ట్... అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు టాంక్ బండ్ వద్ద గల రాణి రుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేడు మన రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది అని ఎటు చూసిన రాష్ట్రంలోని అమ్మాయిల పైన జరుగుతున్న అగాయిత్యలు జరుగుతున్న పట్టించుకోకుండా ఉంటున్న ఈ కుటుంబ పాలన అంతం కావాలని మాట్లాడం జరిగింది.మహిళపై జరుగుతున్న హత్యలకు నిరసనగా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని కోరుతూ మౌన దీక్ష కు దిగిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారి నీ పోలీస్ లు అక్రమ అరెస్ట్ చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఇట్టి కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర నాయకులు సంజీవ రావు,నర్సాపూర్ నియోజక వర్గ కో ఆర్డినేటర్ గౌరిగారి అగమాయ్యా,మరియు దళిత సంగల నాయకుడు చేవెళ్ల నియోజక వర్గ కో ఆర్డినేటర్ డేవిడ్ ( దయానంద్) మరియు పాకాల డానియల్,చైతన్య రెడ్డి మరియు తదితరులు అరెస్ట్ అయ్యారు....
-----------------------
Admin