సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 39 వేల 865 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే సాగర్ నీళ్లు రాక రైతులు బోర్లు,బావులు కింద 17,000 ఎకరాలు మాత్రమే నాటు పెట్టారని,అందులో 7000 ఎకరాలు ఎండిపోయి పదివేల ఎకరాలు మాత్రమే చేతికొచ్చిందన్నారు.చేతికొచ్చిన పంటకు కూడా కూలీల అవసరం లేకుండా యంత్రాల సహాయంతో పూర్తి చేయడం వలన కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో కరువు పరిస్థితి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు వలసలు వెళ్తున్నారని,తద్వారా రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి వలసలు నివారించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రతి కుటుంబానికి 20 కేజీల సన్న బియ్యం,నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు.అధికారంలోకి రాగానే సన్న బియ్యం ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే కేంద్రంలో 14 మంది ప్రధానమంత్రులు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మాత్రం 1125 కోట్లు అప్పు చేసి భారతదేశంలో ప్రతి ఒక్కరి పైన 1,50,000 రూపాయలు చొప్పున అప్పు వేస్తుందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లదనం వెలికితీసి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి ఇంతవరకు జాడ లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అదాని,అంబానీ లకు బిజెపి ప్రభుత్వం ఉడిగం చేస్తుందన్నారు.ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ తో నిమిత్తం లేకుండ రోజుకు 600 రూపాయలు ఉపాధి కల్పించి,ఈ వలసలను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సుజాత రోషమ్మ,గడ్డిరెడ్డి సునీత,పెంటయ్య, పందిరి వీరారెడ్డి,పిచ్చిరెడ్డి,కోట సైదులు,ఏపూరి తిరుపయ్య,బండ్ల సైదులు, యాట ఉప్పమ్మ,ఏపూరి సోమమ్మ,సాలమ్మ,చిలక సరిత,నాగేలు,ముత్యాలమ్మ,గోడ కుమారి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin