సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజున బిపి,షుగర్ వ్యాధి గ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఎన్.సి.డి కిట్లను బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శృతి స్థానిక సర్పంచ్ సునీత,ఉప సర్పంచ్ షేక్ వహాబ్ లతో కలిసి వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెల మధుమేహం,అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సరఫరా చేసే మందు గోలీలను ఎన్.సి.డి కిట్ లలో భద్రపరచుకొని క్రమం తప్పకుండా వాడాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ గాయత్రి, పంచాయతీ కార్యదర్శి నర్సయ్య,వార్డు సభ్యులు పిల్లేండ్ల శివ ప్రసాద్.సయ్యద్ రియాజ్ అలీ, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin