సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా బూత్ పూర్ లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభ పెద్ద ఎత్తున విజయ వంతం చేద్దామని షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్, నందిగామ మండలాల నుండి 2వేల మందితో తన ఆద్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభకు బయలు దేరడం జరిగింది. ఆదివారం ఉదయం మోడీ సభకు బయలుదేరిన వాహనాలకు పార్టీ జెండా ఊపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని ప్రతి గ్రామం నుండి మహిళలు స్వచ్ఛదంగా భారీగా తరలి వచ్చి మోడీ నాయకత్వాన్ని బలపర్చారని అన్నారు. ఈ జోష్ చూస్తుంటే రాష్ట్రం లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు, నందిగామ మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, సుధాకర్ అప్ప, బిజెపి సీనియర్ నాయకులు విజయ్ బాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, ఆకుల ప్రదీప్, బంటారాం లక్ష్మణ్, వివిధ మండలాల్లోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin