సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ' సేవా పక్షం' కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మరియు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం వరంగల్ జిల్లా నర్సంపేట లోని సర్వాపురం హనుమాన్ టెంపుల్ బూత్ నెంబర్179 నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో సర్వాపురం పరిసర ప్రాంతాలలో గల హనుమాన్ టెంపుల్ లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పట్టణ నాయకులతో కలిసి చీపురు పట్టి హనుమాన్ గుడి ప్రాంగణంలో శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ప్రధాని మోడీ గారు భారతదేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. సబ్కా సాథ్ – సబ్కా వికాస్ అనే నినాదంతో దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు అవకాశాలు, కృషి చేసి కృషివేత్తలకు మద్దతు – ప్రతి రంగంలో అపూర్వమైన మార్పులు తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆయుష్మాన్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో ముందంజలో నిలిపారు. మోడీ దృష్టి, దృఢ సంకల్పం వల్లే నేడు భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించింది. ఆయన నాయకత్వంలో దేశం సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. మేము కూడా మోడీ ఆశయాలను అనుసరించి ప్రజాసేవలో కొనసాగుతాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామచందర్, సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణ ,బీజేవైఎం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, నియోజకవర్గ యువ మోర్చా మాజీ కన్వీనర్ మనీష్ గౌడ్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, వరంగటి రాజ్ కుమార్ సీనియర్ నాయకులు కొనుగోటి రవీంద్ర చారి, ముత్యాము శ్రీనివాస్ , మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Reporter