సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం తల్లి లేదా తండ్రి మరణించిన అనాధ పిల్లల కొరకు ప్రవేశపెట్టిన "మిషన్ వాత్సల్య" పథకమునకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకొనే విద్యార్థులకు నెలకు 4వేల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గాను గ్రామీణ ప్రాంతాలవారికి రూ. 72000/- పట్టణ ప్రాంతాన చెందిన వారికి రూ. 96000/- లోపు తహశీల్దార్ కార్యాలయం ద్వారా పొందిన ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యార్థి బ్యాంక్ పాస్ పుస్తకం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, స్టడీ సర్టిఫికేట్, తల్లి లేదా తండ్రి మరణించిన ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో, కళాశాలల్లో చదువుతున్న 18 యేండ్ల లోపు విద్యార్థులు ఈ పథకానికి అర్హులు అని పేర్కొన్నారు. ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీ అనేది ఉండదని తల్లి లేదా తండ్రి కోల్పోయిన ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. సంబంధిత ధృవీకరణ పత్రాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్, యస్ 21 లో అందచెయ్యాలని అన్నారు.
-----------------------
Admin