సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : 24_ 25_ 26 తేదీలలో మూడు రోజులపాటు హుజూర్ నగర్ సాయిబాబా కళ్యాణమండపంలో రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దొంతగాని సత్యనారాయణ వారి కళాబృందం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కళాకారులచే అద్భుతమైన కళోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుండి ఇట్టి కళా ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి హుజూర్నగర్ ఇందిరా చౌక్ నుండి గాంధీ పార్క్ సెంటర్ వరకు చేరుకొని అక్కడనుండి పీర్ల కొట్టం బజార్ నుండి సాయిబాబా కళ్యాణమండపం వరకు కళాకారుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రము 6 గంటలకు మూడు రోజులపాటు నిర్వహించే కళోత్సవాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా కళాకారుల కళా ప్రదర్శనలు తిలకించి మమ్ము ఆనందింప చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు కళాభివందనాలతో ఆహ్వానిస్తున్న వారు శ్రీ దొంతగాని సత్యనారాయణ సీనియర్ కళాకారులు రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు
-----------------------
Admin