Monday, 27 July 2026 08:46:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అటవీ అధికారుల జులుంపై మానవ హక్కుల కమీషన్ విచారణ

Date : 21 January 2023 01:47 AM Views : 885

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గొత్తి కోయలను అటవీ శాఖ అధికారులు బలవంతంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు, వారి భూములు గుంజుకొని వాటిల్లో మొక్కలు వేస్తూ వారి జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల కమీషనుకు 2021లో సుప్రీంకోర్టు లాయర్లు ఆల్టర్ నెట్ లీగల్ ఫోరం ఆధ్వర్యంలో పిర్యాదు చేశారు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రా ప్రభత్వాలను మానవ హక్కుల కమీషన్ వివరణ కోరగా ఇలాంటి ఘటనలు ఏవి తమ రాష్ట్రాల పరిధిలో జరగలేదని నివేదిక అందజేశారు. సంతృప్తి చెందని కమీషన్ బాధితులతో నేరుగా కలసి విచారణ చేసేందుకు గురువారం ములకలపల్లి మండలం ఏనుగు అప్పయ్య నగర్(గొత్తి కోయల గ్రామం)లో మానవ హక్కుల కమీషన్ తెంగాణా-ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి ఎం. మదన్ గోపాల్ (రిటైర్డ్ ఐఏఎస్) అధికారి నేతృత్వంలో విచారణ సాగింది. ఇది గ్రామానికి చెందిన సోడే చుక్కయ్య ఫిర్యాదుదారుడిగా ఉండగా నేరుగా చుక్కయ్యతో మదన గోపాల్ గ్రామస్థులు, వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధుల సమక్షంలో విచారణ జరిపారు. బాధితులు చెప్పిన విషయాలను మదన్ గోపాల్ నివేదిక రూపంలో కమీషన్ కుందించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ లక్ష్మి, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్, అటవీ శాఖ సీసీఎఫ్ భీమా, డీఎఫ్ఓ రంజిత్ నాయక్, ఏఎస్టీఎస్ డైరెక్టర్ గాంధీ బాబు, ఎఫ్డీఓ తిరుమల రావు, ఎంపీడీఓ చిన్న నాగేశ్వరావు, రేంజర్ రవికిరణ్, ఆర్ఐ తారాచంద్, స్వచ్చంద సేవ ప్రతినిధులు రాజ్ కుమార్, చార్వాక, ఊక ముక్తేశ్వరావు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :