సర్కార్ టీవీ న్యూస్ / మహబూబ్ నగర్ జిల్లా : మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ రెసిడెన్సీ భవన సముదాయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళిత జర్నలిస్టులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్ లను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ప్రతి జర్నలిస్టు కు ధళిత బందు, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగత్ ప్రకాష్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంగళ్ళ కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు కొమ్ము దామోదర్ లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin