సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల కనీస వేతనం ఉద్యోగ భద్రతకై చేపట్టిన 6వ రోజు నిరావధిక సమ్మెకు సంఘీభావంగా బహుజన సమాజ్ పార్టీ మద్దతు తెలియ జేసీ జిల్లా ఇంచార్జి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఉదయం తెల్లారక ముందు నుండి సాయంత్రం వరకు గ్రామ వీధులను శుభ్రపరుస్తూ వీధుల్లో మురికిని సైతం లెక్క చేయకుండా శుభ్ర పరుస్తూ పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు కనీస వేతనం పెంచక పోవడం వల్ల కుటుంబ పోషణ బరమౌతుందని ఏదైనా అనారోగ్యానికి గురౌతే ఇక చావే మార్గమనే బ్రతుకుల్లో జీవిస్తున్నారని ఆరోపించారు ఇందుకోసమేన తెలంగాణాను తెచ్చుకుంది, సాధించుకున్నది అని మండిపడ్డారు.గ్రామ పంచాయితీ ప్రతి కార్మికుడి 20,000 వేల రూపాయలు కనీస వేతనం కల్పిస్తూ వారికి ఆరోగ్య భీమా1,00,000 కల్పించాలని,వారి పిల్లాలకు విద్య కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వమే అందించాలని లేని యేడల పంచాయతీ కార్మికుల తరవున బారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ గరిడేపల్లి మండల అధ్యక్షులు అమరవరపు వెంకటేశ్వర్లు,నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి,చిలక సైదా బాబు,పెద్దపంగ సురేష్ బాబు, ఉప్పతల నవీన్, వేముల ప్రవీణ్,బొజ్జా పవన్,గ్రామ పంచాయతీ కార్మికుల సంగం అధ్యక్షులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin