సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల దేవర చెరువు మండలం ఓడిసి పంచాయతీ బాబా సాహెబ్ పల్లి గ్రామానికి చెందిన పలువురు టి.డి.పి.నాయకులు పుట్టపర్తిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అద్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో యస్.లక్ష్మీనారాయణ,యస్.రంగ రాజు,యస్.రంగమ్మ,పి.రాజేష్,పి.అశ్వత్తమ్మ,పి.చంద్రమ్మ,డి.వెంకటరమణ,యస్.యస్వంత్,పి.వెంకటరమణ తదితర కుటుంబాలు వున్నాయి. వారందరికీ పుట్టపర్తి ఎమ్మెల్యే పూలమాలలు వేసి పార్టీ కండవాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఓ డి సి పట్టణ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి, కన్వీనర్ రాజు నాయుడు, మండల వ్యవసాయ అగ్రి అడ్వెంచర్స్ చైర్మన్ లక్ష్మి రెడ్డి, టోపీ, తదితరులు స్థానిక నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin