Monday, 27 July 2026 04:22:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎం కేసీఆర్ మహిళలకు తెలంగాణలో అన్ని రంగాల్లో పెద్దపీట వేశారు... -ఎమ్మెల్యే సైదిరెడ్డి

Date : 14 June 2023 05:34 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, మహిళా భద్రతకు దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా షీ టీం ఏర్పాట్లు చేయడంతో మహిళలు స్వేచ్ఛగా వారి విధులు నిర్వహించుకోవడంతో పాటు ధైర్యంగా కాలేజీలకు, స్కూల్ లకూ వెళ్తున్నారనీ,గతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు .కరోనా సమయంలో మహిళా అధికారులు, అంగన్వాడి టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళ డాక్టర్లు, సిబ్బంది చేసిన శ్రమ మాటల్లో చెప్పలేదని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భారీ బతుకమ్మలతో మహిళ సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి నుండి, డెలివరీ అయిన తర్వాత ఇచ్చే కేసిఆర్ కిట్టు వరకు కూడా అందిస్తున్న ఘనత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కె దక్కుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో... హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా అధికారులు అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాళ్లు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :