సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిరథ మహారధులు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోల్ పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి ఇంకాయమ్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ. ఇంతటి ఆదరణ అభిమానం చూపిన కార్యకర్తలకు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని ఆయన అన్నారు. గతం గతః మీకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరోనా మన రాష్ట్రాన్ని కుదిపేస్తున్నప్పుడు ఎన్నో సవాలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కొంచెం అశ్రద్ధ చేస్తున్న మాట కార్యకర్తల్లో వినిపిస్తున్న మాట కానీ నిరుత్సాహపడకుండా కాలర్ ఎగరేసుకునే విధంగా కార్యకర్తలకు అవకాశం ఇస్తామని అన్నారు జనవరిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కార్యకర్తలతో డైరెక్ట్ గా మాట్లాడతారని మీరు ఊహించిన విధంగానే ఆయన సమాధానం ఉంటుందని ఆయన అన్నారు. రాబోయే 2029లో కనివిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు...
-----------------------
Admin