సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గోరంట్ల మండల కేంద్రంలోని హౌసింగ్ లేఔట్ ను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ* జగనన్న హౌసింగ్ కాలనీ లబ్ధిదారులతో మౌలిక వసతులపై ఆరా తీశారు పూర్తయినపి ఎం ఏ వై వైయస్సార్ హౌసింగ్ లబ్ధిదారులు ఇంటి ముందు లోగో ప్రదర్శించాలి రాష్ట్ర హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పత్రికా ప్రకటన గోరంట్ల, మే 2 : మల్లాపల్లి మిట్ట హౌసింగ్ కాలనీకి వారం రోజుల త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గోరంట్ల మండలంలోనిమాలాపల్లి మిట్ట హౌసింగ్ కాలనీ నందు మౌలిక వసతులపై హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు తో కలసి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హౌసింగ్ లబ్ధిదారులతో ముచ్చటించారుఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో భాగ్యరేఖ, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూఇల్లు అనేది పేదవాడి కల అని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని హౌసింగ్ సిబ్బందిని ఆదేశించారు పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారులే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలన్న స్పష్టం చేశారు. ఈ లేఔట్ నందు 299 ఇల్లు ఉన్నాయని తెలిపారు. 76 ఇల్లు పూర్తయినాయి. రూప్ లెవెల్56, ఆర్ సి లెవెల్18, బి ఎల్ లెవెల్113, బి బి ఎల్ 36, ఇంటి నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయని. అధికారుల ప్రిన్సిపల్ సెక్రెటరీ వివరించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలకు ఎంత డబ్బు ఖర్చయింది, ప్రభుత్వం అందించిన మొత్తం తో పాటు అదనంగా ఎంత ఖర్చు చేశారు, తదితర వివరాలు ఆరా తీశారు. పూర్తయినపి ఎం ఏ వై వైయస్సార్ హౌసింగ్ లబ్ధిదారులు ఇంటి ముందు లోగో ప్రదర్శించాలి. నూరుల్లా, జి దీప, మహబూబ్ జాన్, సుశీలమ్మ, లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ప్రిన్సిపల్ సెక్రెటరీ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. మల్లాపల్లి మిట్ట హౌసింగ్ కాలనీకి వారం రోజుల లోపు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కాలనీల ప్రజలు తాగునీటి సమస్యపై ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ నిధుల నుంచి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. సుమారు నాలుగు తొట్టులకు విద్యుత్ కనెక్షన్ మరియు కరెంట్ మీటర్ కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకు కావలసిన నివేదికలు నాకు పంపాలని వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు ఆదేశించారు . ఈ కాలనీ ప్రజలుతాగునీటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి రషీద్ ఖాన్, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ గోపాల్ రెడ్డి, స్థానిక ఎంపీపీ, ఎంపీడీవో తాసిల్దార్ వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin