సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సాహిత్య రంగంలో ఆత్మగౌరవ భావుటా-గుర్రం జాషువా: సాహిత్య రంగంలో ఆత్మగౌరవ భావుటా గుర్రం జాషువా అని కె.వి.సత్యనారాయణ అన్నారు. హుజూర్ నగర్ టౌన్ లోని జాషువా నగర్ లో గుర్రం జాషువా 128వ జయంతి కార్యక్రమంలో ప్రధాన వక్తగా మాట్లాడుతూ పై విధంగా అన్నారు. విశ్వనరుడుగ అభివర్ణించారు. కులాలకు మతాలకు అతీతంగా మానవ జాతి కళ్యాణం అభిలశించిన వ్యక్తిగా గుర్రం జాషువా ను పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో కలవివక్షను తన గబ్బిలం నవల ద్వారా విమర్శించారు అని అన్నారు. మాతంగి ప్రభాకర్ రావు మాట్లాడుతూ విద్య, అభివృద్ధితో మాత్రమే సామాజిక సమస్యలు, కుల వివక్షను ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కస్తాల శ్రవణ్ మాట్లాడుతూ ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. జాషువా ధైర్యంగా ముందుకు వెళ్ళారన్నారు. అదే స్ఫూర్తితో సామాజిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బయ్యారపు రామారావు, గల్లా వెంకటేశ్వర్లు, చింత్రియాల నాగయ్య, ఆర్. ముత్తయ్య, బయ్యారపు రవీందర్ ఇంజమూరి అంబేద్కర్, నందిపాటి సైదులు, బొడ్డు హుస్సేన్, శ్రీ దేవి, కిరణ్ కుమార్, రవి, మీసాల జనార్దన్, నూకపంగు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin