సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ మహిళల చైతన్యానికి,వీరత్వానికి ప్రతీకగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నిలిచిందని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి అన్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయoలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచారని, పేదల తరుపున పెత్తందారులతో పోరాడిన ఐలమ్మ తెలంగాణ మహిళల వీరత్వానికి నిదర్శనమని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వాములను,రజాకార్లను ఎదురిస్తూ పోరాడటంతో పాటు పీడిత ప్రజలను ఏకం చేసిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని,ఆమె పోరాట స్ఫూర్తి తెలంగాణ సాధనకు తోడ్పాటును అందించిందని వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు .ఇలాంటి ఎందరో తెలంగాణ ప్రాంత పోరాట యోధులను ప్రత్యేక రాష్ట్రం సాధించడం ద్వారానే స్మరించుకోవడం జరుగుతుందని, నాటి పోరాట యోధుల చరిత్రను నేటి తరం మరవకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ ఇ.విజయ్ బాబు, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య, ఏవో జయరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు, రాజువర్మ, ఆర్ఐలు రవి, సుధాకర్, నరసింహా రావు, డీసీఆర్బి, ఐటీ, ఎస్బి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin