Monday, 27 July 2026 08:53:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు... మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు...

Date : 04 July 2023 07:11 AM Views : 452

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చేవారు.. తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు కానీ, మనిషిలోని మూఢత్వాన్ని తొలగించి, మానవ జన్మను సార్థకం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది గురువు మాత్రమే అని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు... షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో సోమవారం ఘనంగా గురు పౌర్ణమి వేడుకలను జరిపారు. ఆలయ కమిటీ నిర్వాహకులు డాక్టర్ విజయ్ కుమార్, కమ్మదనం సుధాకర్, డాక్టర్ మల్లప్ప తదితర నిర్వాహకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నిరుపేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. దేవాలయంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువ జామునుంచే సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే అంజయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమతో శిష్యుడికి గురువు విద్యను బోధిస్తాడు. తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తానంటాడు శిష్యుడు. ఇదీ గురుశిష్యుల సంబంధం. ఏ రకమైన పేగుబంధం లేని పరమాత్మ సంబంధం అది అనీ ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజనేయులు సన్మానించి గురు పౌర్ణమి సందర్భంగా ఆశీర్వదించారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్, ఎస్పీ శివ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: