సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ కిట్టు రూమును పరిశీలించిన షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, షాద్ నగర్ సివిల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తెలంగాణ ప్రభుత్వము నుండి మే 7వ తేదీన 200 కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు వచ్చాయి అని, మే 13 వ తారీఖున 407 కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు వచ్చాయి అని, మొత్తం 607 కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాయని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జయలక్ష్మి తెలియజేశారు. ఈ కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు ను గర్భవతులలో ఎవరైతే రక్తహీనతకు గురి అయి ఉంటారో వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గర్భవతి రెండవ చెకప్ కు వచ్చినప్పుడు అనగా గర్భవతి 14 వారాల నుండి 26 వారాల మధ్య ఉన్న గర్భవతికి, ఈ కిట్లను అందజేస్తారు అని గర్భవతిగా ఉండి రక్తహీనకు గురైన వ్యక్తి మూడవ చకప్ కు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ తో పరీక్ష చేయించుకోవడానికి వచ్చినప్పుడు అనగా గర్భవతి 27 వారాల నుండి 34 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు, ఈ కిట్లను వారికి అందజేస్తారని డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలియజేశారు. ఈ కిట్లలో ఒక కిలో న్యూట్రిషన్ పౌడర్, ఒక కిలో ఖర్జూర పండ్లు, ఆఫ్ కేజీ ఆవు నెయ్యి, మూడు ఐరన్ బాటిల్స్ సిరప్, రెండు పల్లి పట్టీలు, ఒక కప్పు, వీటిని అన్ని తిని పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ బాస్కెట్ ఉంటాయి అని డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలియజేశారు. ఈ న్యూట్రిషన్ కిట్లను తెలంగాణ ప్రభుత్వము రక్తహీనత కలిగివున్న గర్భవతులకు అందజేయడం వలన పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ ఎస్ విజయలక్ష్మి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వము అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను గ్రామాలలో ఉన్న గర్భవతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, కేసీఆర్ కీట్ ఇంచార్జి అరుణ, అన్వర్, హరీష్, రవికుమార్ పాల్గొన్నారు.
-----------------------
Admin