సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ...* *తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని 'విజయ్ దివాస్'గా ఘనంగా నిర్వహించుకోవాలని నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.....* *♦️ డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజు ????* *కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని కేటీఆర్ గుర్తుచేశారు. నవంబర్ 29న 'దీక్షా దివాస్'ను విజయవంతం చేసినట్లే, కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా ‘విజయ్ దివాస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష వలన ఒక రూపం వచ్చిందని అన్నారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు.* *????????స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించాలని తెలిపారు????????.....*
-----------------------
Reporter