Sunday, 26 July 2026 02:51:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హాజీపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల కాంగ్రెస్ లో చేరిక...

Date : 28 October 2023 06:03 AM Views : 372

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా వారి సేవలను పొంది ఆ తర్వాత వారికి అన్యాయం చేశారని ఎంతోమంది ఉద్యమకారులు రోడ్లపై పడ్డారని వారిని చేరదీసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ముందుకు వస్తుందని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ భరోసా ఇచ్చారు. హాజిపల్లి గ్రామం నుండి గ్రామ ఉప సర్పంచ్ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు 2007 నుంచి ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉండి తగిన గుర్తింపు లేక కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. ఇస్నాతి విష్ణు కుమార్, వార్డు సభ్యులు గుండ్రాది విష్ణు, కో ఆప్షన్ నెంబర్ వి జంగయ్య, రూప్ సాగర్, పాండురంగం, ఎస్ ఉపేందర్, శివ, రాజేష్, జి సాయిబాబు, రమేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పిందనీ ఉద్యమ కారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 250 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షలు విద్యా భరోసా, రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ గవర్నమెంట్ స్కూల్, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ.4 వేల ఫించన్, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యభీమా, మహాలక్ష్మి పేరుతో మహిళలకు రూ.2500 సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం, క్వింటాల్ వరి పంటకు రూ.500 బోనస్, గృహ అవసరాల నిమిత్తం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆజిపల్లి ఉపసర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ శ్రీశైలం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామప్ప, ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సురేందర్ గౌడ్, రాజేందర్ తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :