సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడుగూరు మండలం మలకవారిపల్లి వద్ద విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న స్కూల్ వ్యాన్ తప్పించబోయి వరి పొలాల్లోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు జెసిబి సాయంతో మహేష్ మృతదేహాన్ని బయటకు తీశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు...
-----------------------
Admin