సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : *భూపాలపల్లి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను, నాయకులను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకుని గెలిపించుకుని రావాలని పార్టీ శ్రేణులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈరోజు భూపాలపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్ళపల్లి, గణపురం మండలాల్లోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే నాయకులకు పలు సూచనలు చేశారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని, వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విరిజర్వేషన్లు వచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైనా ఆర్థికంగా బలహీనంగా ఉంటే, ఆ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు ఆ అభ్యర్థి విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
-----------------------
Reporter