Sunday, 26 July 2026 07:11:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు...

Date : 16 February 2023 12:13 AM Views : 753

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, ఆ మాటను నిలబెట్టుకుంటానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా పత్రికలు, కేబుల్ చానళ్ళకు చెందిన జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సారథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను బుధవారం కలసి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులల్లో సగం మందికి పైగా రెవెన్యూ సర్వే జరిగిందని, మిగిలిన చిన్న, మధ్యతరహా పత్రికలు, కేబుల్ చానల్స్, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డెస్క్ జర్నలిస్టులు ఖమ్మం లో విధులు నిర్వహిస్తూ, జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటున్నందున వారికి ఇళ్ల స్థలాలు ఖమ్మంలోనే వర్తింపజేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కోరారు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందిస్తూ. ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీకిచ్చిన మాటను నిలుపుకుంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీని పటిష్టంగా అమలు పరుస్తానని మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు, డిపిఆర్ఓ కు తెలియజేసి సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ. జర్నలిస్టులు సంయమనం పాటించాలని, ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంత్రి ఇచ్చిన హామీని నిలుపుకుంటారన్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉందని అన్నారు. ఖమ్మం నిండు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు జరుగుతుందని, ఎవరు కూడా ఆందోళన చందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు(ఐజేయు) వెన్నెబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు పిన్నెల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు జానీ పాషా, కొత్త యాకేష్, తిరుపతిరావు, ప్రెస్ క్లబ్ కోశాధికారి బిక్కీ గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరావు, సహాయ కార్యదర్శి జీవన్ రెడ్డి, మహిళా ప్రతినిధి వంగూరి ఈశ్వరి, నాయకులు వనం నాగయ్య, జక్కుల వెంకటరమణ, ఉత్కంఠం శ్రీనివాస్, యాదగిరి, సంతోష్, మోహన్, వెంకటకృష్ణ, పురుషోత్తం, శ్రీనివాస్, వేణుగోపాల్, బండి కుమార్, బి కుమార్, కాశీం, ప్రభాకర్ రెడ్డి, పానకాలరావు, పురుషోత్తం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: