Monday, 27 July 2026 05:36:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలుకు స్వాగతం...

Date : 25 September 2023 04:29 AM Views : 185

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ రైల్వే స్టేషన్లో ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రారంభించిన వందేభారత్ రైళ్ల నేపథ్యంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి, స్థానిక రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు డాక్టర్ కే చంద్రశేఖర్ స్థానిక మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్, స్థానిక బిజెపి నేతలు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువ నాయకుడు ఏపీ మిథున్ రెడ్డి, కక్కునూరి వెంకటేష్ గుప్త, నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయకుమార్, సీనియర్ నేత కమ్మరి భూపాల చారి, కౌన్సిల్ సభ్యులు చెంది మహేందర్ రెడ్డి, రైల్వే అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున హాజరై వందేభారత్ రైలుకు స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు రాక సందర్భంగా భారత్ మాతాకీ జై, వందే.. భారత్ అంటూ పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే వందేభారత్ రైళ్ల ఏర్పాటు గొప్పదని అన్నారు. ప్రయాణికులకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అత్యంత వేగంగా తమ గమ్యస్థానాలు చేరుకునే విధంగా సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వ గొప్పతనం అని అన్నారు. రైల్వే బోర్డు సభ్యులు డాక్టర్ కే. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. షాద్ నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి అత్యాధునిక అవసరాల పెరుగుదలకు తనవంతు కృషి చేశానని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక రైళ్ళను ఆదేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. ఎంతోమంది మహిళా ప్రయాణికులు, మీడియా, ప్రజలు నిత్యం హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా తిరిగే వారి సౌకర్యార్థం వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైళ్ల స్టాప్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. త్వరలోనే ఎంపీ కోటాలో ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం పెడతామని అన్నారు. మహబూబ్ నగర్ లో మంజూరు జరిగిందని ఇక తర్వాత షాద్ నగర్లో కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ.. వందే భారత్ రైలు ఇక్కడ కూడా ఆగేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇది ఎంతో గొప్పదని అన్నారు. బిజెపి నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైలు మార్గం ద్వారా అనేక ప్రాంతాలకు సౌకర్యాలను అనుసంధానం చేసి గొప్ప సేవలను అందిస్తున్నారని ప్రధాని మోడీని కొనియాడారు. భవిష్యత్తులో షాద్ నగర్ ప్రాంతం గొప్ప పట్టణంగా వర్ధిల్లుతుందని అన్నారు. దేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గొప్ప పనితీరు కనబరుచుతున్నారని ప్రశంసించారు. యువ నాయకుడు ఏపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో సికింద్రాబాద్ కాచిగూడ నుండి బెంగళూరు యశ్వంతపూర్ వరకు, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పాట్నా నుండి హౌరా వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం గొప్ప విశేషమని అన్నారు. పండుగల సీజన్లో ప్రారంభమవుతున్న వందే భారత్ రైళ్లు ప్రయాణికుల ప్రయాణ అనుభూతిని మెరుగు పరుస్తాయనీ వివిధ ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లు తిరగ నున్నాయని మాట్లాడారు. ఇంకా పలువురు అధికారులు మీడియాకు తెలియజేస్తూ.. పుణ్యక్షేత్రాలైన పూరి, మధురైలను, తిరుపతికి కనెక్టివిటీని కలిగిన ఈ రైళ్ళు సెమీ హై స్పీడ్ సిరీస్ లో వస్తున్న రైళ్లనీ, ఈ రైళ్ల వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని ఆన్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న క్రమంలోనే నేడు మరో తొమ్మిది రైళ్ళను ప్రారంభించడం చరిత్రలో గొప్ప విషయమని కొనియాడారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: