సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి తాడుతో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి మొరపెట్టుకొని ఉరి వేసుకునే ప్రయత్నం చేసిన ఎస్సీ కులానికి చెందిన నాగేంద్ర టిడిపి కార్యకర్త. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ ఒక్క కార్యకర్త కు న్యాయం జరగటం లేదని ఆవేదన చెంది అరకొరగా వచ్చిన పోస్టులను కూడా వైసీపీ వాళ్లకు అమ్ముకుంటున్నారని బాధితుడు నాగేంద్ర ఎన్టీఆర్ విగ్రహానికి మొరపెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్ వారు వెంటనే స్పందించి నాగేంద్ర ను అక్కడ నుంచి తప్పించారు. వెనువెంటనే లారీ కింద పడే ప్రయత్నం కూడా చేశాడు. పోలీసు వారు స్టేషన్ తీసుకెళ్లారు నీకు న్యాయం జరిగేటట్లు మేము మాట్లాడతాము అని చెప్పి అతనిని సమాధానపరిచారు. ఏది ఏమైనా పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలను మరవటం చాలా దుర్మార్గం అని మాట్లాడుకుంటున్న ప్రజలు...
-----------------------
Admin