సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం పట్టణంలోని విజ్ఞాన కళాశాలలో సీఐ ప్రభాకర్ అధ్యక్ష తన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రభాకర్ రావు మాట్లాడుతూ. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. అనవసరమైన గొడవలకు విద్యార్థులైన మీరు దూరంగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం ఎస్సై చౌడప్ప మాట్లాడుతూ. విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అవగాహనతో కలిగి ఉండాలని గొడవలకు ఎలాంటి యసనాలకైనా దూరంగా ఉండాలని ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి సమస్య అయినా సరే మా దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు ఆయన కోరారు. విద్యార్థులు స్నేహభావంతో మెలగాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అనవసరమైన కేసులు ఇరుక్కోకుండా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల యాజమాన్యం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు...
-----------------------
Admin