Sunday, 26 July 2026 10:02:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రోటరీ అవార్డు పొందిన అందూరి గంగాధర్...

Date : 09 September 2023 05:58 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని విద్యా హై స్కూల్ ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం మరియు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించారు.ఇందులో నందిపేట్ ,డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల నుండి డొంకేశ్వర్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అందూర్ గంగాధర్ బెస్ట్ టీచర్ నేషన్ బిల్డర్ అవార్డుకు ఎంపికై సన్మానం పొందారు.ఈ సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ ,ప్రైవేట్ పాఠశాలలో పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 25 మంది ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ శాలువ, పూలమాల,సర్టిఫికెట్స్ తో అభినందించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ యూనివర్సిటీ రిజిష్ట్రార్ యాదగిరి వక్తగా విద్యా విలువల గురించి ఉపాధ్యాయుడు, విద్యార్థిల అనుబంధాన్ని గుర్తు చేస్తూ వైఖరులను సన్మానంపొందిన ఉపాధ్యాయులకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో రోటరీ గవర్నర్ ఎన్ వి హన్మంత్ రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షులు విద్యా గోపికృష్ణ ,ప్రధాన కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రాజెక్ట్ చైర్మన్ విద్యా ప్రవీణ్ పవార్ ,రొటేరియన్స్ మానస గణేష్ ,కాంతి గంగారెడ్డి, మురళి,పిప్రికర్ పుష్పకర్ రావు, సురేష్ కుమార్ ,ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :