సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా సోమవారం ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో హరితోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరైనారు. ఈ కార్యక్రమంలో కమ్మదనం అటవీ శాఖ అధ్యక్షతనలో ఎమ్మెల్యే అంజయ్య మొక్కలను నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం. ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇప్పటికే చేపట్టిన అనేక విడుతలు విజయవంతంగా పూర్తి కావడంతో షాద్ నగర్ నియోజక వర్గంలో నేడు ఎటుచూసినా పచ్చదనం పరిఢవిల్లుతున్నదని, లక్షలాది మొక్కలు ప్రాణం పోసుకున్నాయని రోడ్లకు ఇరువైపులా.. ప్రభుత్వ స్థలాలు, గ్రామాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, పల్లె, పట్టణ, బృహత్ ప్రకృతివనాలు, అర్బన్ పార్కుల్లో పెద్ద ఎత్తున నాటిన మొక్కలతో పచ్చదనం కొంగొత్త అందాలను సాక్షాతరింపజేస్తున్నదని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. భావితరాల సంక్షేమం కోసం ముందే ఆలోచించే క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మానవాళికి పొంచి ఉన్న ముప్పును గ్రహించారనీ, ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారని, తన పరిధిలోని తెలంగాణలో శక్తి మేరకు చెట్లు నాటడం, పరిరక్షించే కార్యక్రమాన్ని ఉద్యమ స్పృహతో సాగించాలని నిర్ణయించారని అన్నారు. ఈ క్రమంలో చేపట్టిందే తెలంగాణకు హరితహారం కార్యక్రమం అని కొనియాడారు. ఇది ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోదగిన పెద్ద ఉద్యమంగా చెప్పవచ్చని కేసీఆర్ దేనినైనా ఉన్నతస్థాయిలో ఆలోచిస్తారు, ఆచరిస్తారు. హరితహారం కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున రూపకల్పన చేశారు. దీని అమల్లో విజయవంతమయ్యారని నేడు దేశానికి తెలంగాణ హరితహారం ఒక రోల్ మాడల్ అనీ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర సహకార సొసైటీల చైర్మన్ రాజా వరప్రసాద్, ఫారెస్ట ఆఫీసర్ రవీందర్, సిబ్బంది, సర్పంచ్, నాయకులు, స్కూల్ విద్యార్థులు, టీచర్లు, స్థానిక అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు...
-----------------------
Admin