సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బిఆర్.అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబా సాహెబ్డా బిఆర్.అంబేద్కర్ 132వ జయంతి మహోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, డిఆర్ఓ కొండయ్య, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్ all India అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడు ధూపం పల్లి కేశప్ప సాయి నగర్ సంజీవ్ ఎంవైపి ఓబులేసు తదితరులు డా.బిఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి.. పాఠశాలలో చిన్న వయసులోనే వివక్షను ఎదుర్కొని.. ఏనాడు వాటిని లెక్క చేయకుండా చాలా కష్టపడి చదువుకొని ప్రపంచంలో గర్వించదగ్గ మేధావిగా డా.బిఆర్.అంబేద్కర్ నిలిచారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన మనోధైర్యం కోల్పోలేదని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత పేదరికం ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా చదువును కొనసాగించారు.కొలంబియా విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడని అన్నారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడని మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశాడని అన్నారు.
-----------------------
Admin