సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కెట్ లోని కాంతి హైస్కూల్లో మట్టి వినాయక తయారీ పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లలు వారి ప్రతిభ మరియు సృజ నాత్మక ప్రతిబింబిoచేల మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి గారు మాట్లాడుతూ మన ధర్మం సంప్రదాయాలను పిల్లలకు పెంపొందించడానికి మన సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించామని. మతాలక తీతంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. పిల్లలు దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏడాది పొడువున నిర్వహిస్తూ వారికి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కాంతి గంగారెడ్డి, డైరెక్టర్స్, ఉపాధ్యాయులు బృందా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin