సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ లోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి మీద కాజీపేట కడిపికొండ బ్రిడ్జి పై గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ తో దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా జఫర్గడ్ అని తెలిసింది. కాజీపేట ఏసీపీ పోలీసులు ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు.
-----------------------
Reporter