Monday, 27 July 2026 05:24:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీడీపీ అధినేత బస్సు యాత్రను విజయవంతం చేద్దాం... -మాజీ మంత్రి పల్లె పిలుపు

Date : 23 June 2023 11:57 PM Views : 500

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి / మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన భవిష్యత్ కు గ్యారెంటీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో జోన్ 5 పరిధిలోని అయిదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో శుక్రవారం నుండి బస్సు యాత్ర ప్రారంభమై శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మొదటి రోజు కదిరి నియోజకవర్గంలో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుందని నేడు అనగా శనివారం ఉదయం 10 గం "లకు నల్లమాడ మండలం బుగ్గల పల్లి వద్ద బస్సు యాత్ర ప్రారంభమై గోపే పల్లి మీదుగా నల్లమాడ మండల కేంద్రంలో టిడిపి హయాంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు ప్రజలు వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పై వినతి పత్రాలు స్వీకరించి అక్కడి నుంచి వెంగలమ్మ చెరువు మీదుగా వీరజిన్నయ్య గారి పల్లి వద్ద భోజన విరామం ఉంటుంది అన్నారు.అక్కడి నుండి పుట్టపర్తి టిడ్కో గృహాల పరిశీలన, పుట్టపర్తి చెక్ డ్యాం పరిశీలన అనంతరం బుక్కపట్నం మండల కేంద్రం చేరుకుంటుందని వివరించారు. అనంతరం టిడిపి హయాంలో మంజూరైనప్పటికి నిర్మాణం చేపట్టకుండా మధ్యలో ఆపేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిశీలన మరియు చంద్రబాబు నాయుడు గారు బుక్కపట్నం చెరువు కట్టపై ఆవిష్కరించిన పైలాన్ పరిశీలిస్తామని వివరించారు. అనంతరం చెరువు కట్ట మీదుగా కొత్త చెరువు మండల కేంద్రం చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. అదే రోజు రాత్రి పుట్టపర్తిలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టడం ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలో బస్సు యాత్ర ముగుస్తుంది అని వివరించారు.ఈ యాత్రలో అన్ని అయిదు పార్లమెంట్ నియోజకవర్గాలు నుంచి అందరూ అధ్యక్షులుతో పాటుగా నియోజవర్గ ఇంఛార్జిలు, ప్రస్తుత మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొంటారని, కావున పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.పుట్టపర్తి నియోజవర్గంలోని ఆరు మండలాలు మరియు మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ద తీసుకొని పని చేయాలని, అధినేత ఆదేశించినట్టు ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇదో మంచి అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలని పెద్ద ఎత్తున భాగస్వామ్యులు చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :