Sunday, 26 July 2026 11:33:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మేల్యే అంజయ్య యాదవ్...

Date : 16 August 2023 05:39 AM Views : 361

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : సమాజంలో మానవత్వం, సామరస్యం, సహకారం చాలా గొప్పవని వీటితోనే దేశంలో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంతో పాటు పలు చోట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం వీరులు చేసిన త్యాగాన్ని ఎన్నటికీ మరువలేమని అందుకే ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవాలు నాడు వారి త్యాగాలను స్మరించుకుంటున్నామని అన్నారు. సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా కలిసివచ్చి సామరస్యంగా ప్రజలందరూ మెలిగిన నాడే సంపూర్ణమైన అభివృద్ధి సహకారం అవుతుందని అన్నారు. ప్రతి మనిషిలో కష్టపడే తత్వం నిజాయితీ, త్యాగ గుణం ఉండాలని ఆకాంక్షించారు. వీటితోనే కుటుంబం గ్రామం రాష్ట్రం తద్వారా దేశం బాగుపడుతుందని అన్నారు. మానవసేవే మాధవ సేవ అన్న నానుడి పాటించి అందరిని సేవతో మెప్పించాలని అన్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన స్వతంత్ర వేడుకల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. అదే విధంగా అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ కలలను సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇద్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజ్ ఎస్సై ప్రతాప్ లింగం ఆర్డిఓ మాధవ రమణ, తాసిల్దార్ పార్థసారథి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: