Monday, 27 July 2026 07:41:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వర్షాల దృష్ట్యా ప్రజలు,అప్రమత్తంగా ఉండాలి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు

Date : 29 October 2025 06:45 PM Views : 132

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి జిల్లా అధికారులను ఆదేశించిన తక్కలపల్లి రవీందర్ రావు వరంగల్ జిల్లా వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో... క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో తక్కళ్లపెల్లి రవీందర్ రావు మాట్లాడుతూ..తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల...రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్,రెవిన్యూ,ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లోని అన్ని చెరువులు నిండి ఉన్నందున,ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పునరావస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తాసిల్దారులు,ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. చెరువులు నిండి వంకలన్నీ ఉధృతంగా ప్రవహించనున్న నేపథ్యంలో తాసిల్దార్లు,ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని లు గ్రామాలు జల మాయమయ్యే ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉద్ధృతితో రోడ్లు తెగిపోయిన ఉదృతంగా ప్రవహించిన ఆయా ప్రాంతాల్లో ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని బ్యారికలు ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని,కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరా లో అంతారం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్,రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు చెరువులు కుంటలు లోని నీటిమట్టలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. *ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కల పెళ్లి రవీందర్ రావు అన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :