సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కల్లూరు లో జాతీయ రహదారులు గుంతల మయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారాయి. అధ్వానంగా తయారయ్యాయి.దీంతో ప్రజలు ప్రయాణికులు వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు నుండి తిరువూరు వెళ్లే జాతీయ రహదారి రహదారిలో ఎన్. ఎస్ .పి. రింగ్ రోడ్డు నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు ప్రమాదాలకు నిలయముగా మారాయి. ఆదమరిస్తే అంతే సంగతులు అన్నట్లుగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాలు నడపవలసిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కాలంలో అనేకమంది టూవీలర్ వాహనాలు గంటలలో పడిపోయి భార్య పిల్లలు ఎంతోమంది ప్రమాదాల బారిన పడ్డారు.ఈ ప్రాంతములో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో నూతనకల్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బైకు పై వెళ్తుండగా షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గుంతలో పడి కాలు విరిగి రెండు చోట్ల ప్యాక్చర్ కావడం జరిగింది. తిరువూరు లో ఆపరేషన్ కూడా చేశారు. ఈ నష్టానికి ఎవరూ బాధ్యులు....??? ప్రమాదాలకు ఎవరు కారుకులు .....??? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోగలరు....??? అధికారులే సమాధానం చెప్పాలి అంటున్న ప్రజలు....??? ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్న పట్టించుకునే నాధుడు లేడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి రోడ్లు మరమత్తులు చేపట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.
-----------------------
Admin