సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు .ఇట్టి కార్యక్రమానికి మఠంపల్లి ఎంపీడీవో మామిడి జానకి రాములు ముఖ్యఅతిథిగా విచ్చేయగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య జెండా ఆవిష్కరణ చేసి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన భారతదేశ స్వాతంత్రాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు బానోతు పాండు నాయక్, బేత శివారెడ్డి, మాలోతు రవీందర్ నాయక్, పల్లె సుధాకర్, చిలక సైదయ్య ,బలుసుపాటి రవి, మాజీ సర్పంచ్ కొత్తపల్లి కృపానందం పిఎసిఎస్ డైరెక్టర్ కొమ్ము కరుణ సైదులు, బానోతు రంగా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin