సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ రూరల్ : ప్రజలను కేవలం ఓట్లు వేసే మర యంత్రాలుగా చూడడం ఎంతవరకు న్యాయమని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రశ్నించారు.మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ పాల్వంచ పట్టణం,మండలంలో ప్రజలకు కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనేక తండాలలో తాను పర్యటించినప్పుడు వీధిదీపాల సంగతి పక్కన పెడితే ఇళ్లల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షాకాలంలో ప్రజలు అనారోగ్యాల బారినపడి ఆసుపత్రులకు వెళ్లాలంటే కనీసం ఆంబులెన్స్ సౌకర్యం కూడా లేదని అన్నారు.కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ పాల్వంచ ఆసుపత్రికి వచ్చే రోగులను డయాలసిస్ కోసం మణుగూరు,భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడం విడ్డూరంగా ఉందన్నారు.ఇప్పటికైనా పాలకులు,వైద్యాధికారులు పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అంబులెన్స్ సౌకర్యం గురించి గతంలో ఆందోళనలు నిర్వహించామని,అధికారుల దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు.తక్షణమే అధికారులు స్పందించి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పాల్వంచ మండల పరిధిలోని కుగ్రామాలలో నివసించే ప్రజలను మమేకం చేసి బీఎస్పి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,కేతిని కుమారి,యెర్రంశెట్టి రాజేశ్వరి,మంజుల తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin