సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని శనివారం షాద్ నగర్ పట్టణంలో ఫోటోగ్రాఫర్ లు అందరూ ఘనంగా నిర్వహించారు. ఫొటో గ్రాఫర్ ల సంఘం ఫరూఖ్ నగర్ మండల అద్యక్షుడు రవితేజ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు శివలింగం, ప్రధాన కార్యదర్శి పేరేపల్లి శేఖర్ హాజరయ్యారు. ముందుగా పట్టణంలోనీ రైల్వే స్టేషన్ నుండి ఫోటోగ్రాఫర్ అంతా కలిసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ముఖ్య కూడలిలో ఫోటోగ్రఫీ పితామహుడైన లూయిస్ డగ్రే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోనీ 150 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఫొటో గ్రాఫర్ ల సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం సమర్పించగా సానుకూల స్పందన రావడం పట్ల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల ఫోటోగ్రాఫర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎంజాల్ రాజు, కోశాధికారి విజయ్ తో పాటు నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ లు పాల్గొన్నారు.
-----------------------
Admin