సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం సర్కార్ టీవీ న్యూస్ ప్రతినిధి సంఘసాని జగన్ దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీ లో వేద పండితుల సమక్షం లో రాజ శ్యామల హోమం చేసి ఘనంగా బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించగా నేడు తొలిసారి పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో కేంద్ర కార్యాలయానికి రాగా పార్టీ శ్రేణులు జై భారత్,జై కెసిఆర్,జై బీ అర్ యస్ నినాదాలతో హోరెత్తించారు,సీఎం కెసిఆర్ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులను ఆప్యాయంగా పలకరించారు,ఈ సందర్భంగా ఎంపీ నామా ఆహ్వానం మేరకు దిశ కమిటీ సభ్యుడు మందలపల్లి ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ కార్యక్రమానికి హాజరై సీఎం కెసిఆర్ని నామా ఆధ్వర్యం లో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతా పూర్వక శుభాకాంక్షలు తెలియజేసినారు, 3000 మందికి పైగా విందు భోజనం ఏర్పాటు చేసిన ఎంపీ నామా ను ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు, కార్యక్రమంలో వైరా జడ్పిటిసి నంబూరి కనక దుర్గ, లగడపాటి రమేష్, నాయుడు,పానుగంటి లోకేష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin