సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూస్... మహిళల అవసరసరాలను ఆసరా చేసుకొని లోన్ల పేరిట విచ్చలవిడిగా కమిషన్లు దండుకొని మహిళలను నట్టేట ముంచుతున్న మైక్రో ఫైనాన్స్.., భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని బ్యాంకులకు అనుసంధానం చేయబడిన పని చేస్తున్న మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అన్ని ఇన్ని కావు, ఫైనాన్స్ అంటే వడ్డీ వ్యాపారం అలాంటి వ్యాపారాన్ని కొందరు ఆ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్లు వడ్డీతో పాటుగా కమిషన్ వ్యాపారంగా మార్చి కుటుంబ అవసరాలకు ఫైనాన్స్ తీసుకుంటున్న మహిళలను నట్టేట ముంచేస్తున్నారు, 1లక్ష రూపాయలు లోన్ తీసుకున్న మహిళలకు వడ్డీ ఎలాగో పడుతుంది ఆ వడ్డీతో పాటుగా 5నుండి 10వేలు కమిషన్ కూడా తీసుకోని లోన్లు ఇస్తున్నారని ఒకవేళ ఆ కమిషన్ ఇవ్వకపోతే లోన్లు ఇవ్వకపోగా అనేకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు వాపోతున్నారు, ఎవరైతే ఫైనాన్స్ కంపెనీ మేనేజర్లను ఈ వ్యవహారం మీద ప్రశ్నిస్తారో వారు క్రమంగా ఫైనాన్స్ కట్టిన వారికీ రీ లోన్ చేయకుండా ఆపేస్తున్నారని మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు... ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోని మహిళలను దోచుకుంటున్న ఆ కంపెనీ మేనేజర్ల మీద చర్యలు తీసుకోని మహిళలకు న్యాయం చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు... భద్రాద్రి కొత్తగూడెం సర్కార్ న్యూస్ ప్రతినిధి షేక్ ఆసిఫ్
-----------------------
Reporter