Monday, 27 July 2026 05:05:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి...

Date : 19 August 2023 12:11 AM Views : 386

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కొత్తగూడెం : యుద్ధాలు వద్దురా కొడకా మనది గీత వృత్తి, అది చేసే బ్రతకాలి అని సర్వాయి పాపన్న తల్లి అన్నప్పుడు తాటి చెట్టు ఎక్కితే ఎమోస్తదమ్మా...ముంత కల్లు తప్ప, కొడితే గోల్కొండ కోటను కొట్టాలి,రాజై పాలించాలని రాజ్యాన్ని ఏలిన, వెన్నుచూపని బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.శుక్రవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 మంది స్నేహితులతో పాపన్న మొదలు పెట్టిన గెరిల్లా సైన్యం అటు స్థానిక దొరల,జమిందార్ల,ఇటు మొఘల్ సైనికులపై దాడులు చేసి గడీల దొరల గుండెల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తించి గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగురవేసి,బహుజన రాజ్యం స్థాపించిన యోధుడని,ఏ నేపధ్యం లేని పాపన్న, నాడు బరిసెలు,పిరంగులు...నేడు పోలింగ్ బూతులు,బ్యాలెట్స్..సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో తెలంగాణను విముక్తి చేసి,ప్రజాస్వామిక తెలంగాణను స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,బీఎస్పీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులుసాయి,కవిత,నీల,శారద,హారిక,సునీత తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :