సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని అందరినీ పర్మినెంట్ చేయాలని బిల్ కలెక్టర్లు కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12 నుంచి సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రకు మద్దతుగా నేడు అనగా ఫిబ్రవరి 20వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దమ్మ తల్లి గుడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తెలిపారు పాదయాత్ర జయప్రదం కోసం సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికులతో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు పంచాయతీ కార్మికులకు రావలసిన మూడు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు గోదావరి వరదల సమయంలో ఒక నెల వేతనం అదనంగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కనీస వేతనం 26000 ఇవ్వాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న ద్వం దనీతికి వ్యతిరేకంగానే పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పాదయాత్రలో పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు యాకోబు చారి పద్మ వెంకటమ్మ సిఐటియు భద్రాచలం పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin