Sunday, 26 July 2026 04:09:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన వాలంటీర్లు...

Date : 20 May 2023 06:54 AM Views : 481

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : విజయవాడ నుంచి శుక్రవారం ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది చేపట్టిన ”వాలంటీర్లకు వందనం కార్యక్రమం"లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు అందజేశారు. ఉత్తమ అవార్డు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వాలంటీర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న పలువురు వాలంటీర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాలంటీర్ల అభిప్రాయాలు 1. ప్రజాసేవలో జగనన్న సైనికురాలిగా ఉండడం గర్వంగా ఉంది : ఈ. చైతన్య, సేవ వజ్రా అవార్డు గ్రహీత, కొడపగాని పల్లె గ్రామం, కొత్తచెరువు మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ మంచి జరగాలనే ఆశయంతో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. వాలంటీర్లుగా మమ్మల్ని నియామకం చేసి.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్రజాసేవలో జగనన్న సైనికురాలిగా నేను ఉండడం... ఈరోజు సేవా వజ్ర నగదు పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. సేవ వజ్రా అవార్డులను అందించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. 2. వాలంటీరుగా సమాజంలో గౌరవం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు : సాయి లీల, సేవా వజ్రా అవార్డు గ్రహీత, బుక్కపట్నం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. జగనన్న సంక్షేమ క్యాలెండరును అనుసరించి.. జగనన్న ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ లను అవ్వ తాతలకు అందించడంతోపాటు వివిధ సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. పెన్షన్లను అందజేసినప్పుడు అవ్వ తాతలు చూపించే ప్రేమ, ఆప్యాయతలు మరువలేనివి. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వాలంటీర్లుగా సమాజంలో మాకు ఒక గౌరవం కల్పించిన ఈ ముఖ్యమంత్రి కి సెల్యూట్ చేస్తూ... మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3. ప్రభుత్వ ఆశయ సాధనకు కృషి చేస్తాం : గంగాద్రి, దిగువచర్లోపల్లి గ్రామం, పుట్టపర్తి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. చదువుకున్న నిరుద్యోగ యువతకు గ్రామంలో స్వచ్ఛందంగా, నిస్వార్ధంగా, ఒక వాలంటీరుగా సేవ అందించే భాగ్యాన్ని ముఖ్యమంత్రి గారు మాకు ప్రసాదించారు. దేశంలోనే సచివాలయ వ్యవస్థకు మంచి పేరు రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అర్హత ఉన్న ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వానికి సహకారం అందిస్తూ... జగనన్న సైనికుడిగా... ప్రభుత్వ ఆశయానికి ఉద్దేశాలకు అనుగుణంగా విధి నిర్వహణ చేస్తాం.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :