సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా దుగ్గొండి తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారసత్వ భూమికి సంబధిత ఫైల్ పరిష్కారం కోసం రూ.10 వేల లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ రాంబాబు ను ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే మండలంలోని మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తన తండ్రి నరసయ్య మరణంతో తన తండ్రి పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమి పట్ట చేసుకునేందుకు వారసత్వ భూమి నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోగా సంబంధిత ఫైల్ ను ముందుకు జరిపేందుకు ఆర్ఐ రాంబాబు రూ.10 వేల లంచం డిమాండు చేసినట్లు సమాచారం.బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు.తహసిల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు ఆర్ఐ ను అదుపులోకి తీసుకొని,నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి, సంబంధిత పత్రాలను సీజ్ చేసినట్లు తెలిసింది.ఈ ఘటనతో తహసిల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ రాంబాబు ఈ ఏడాది జూలై 30న ఉద్యోగ విరమణ (రిటైర్మెంట్) పొందాల్సి ఉంది. కేవలం రెండు నెలల్లో పదవీ విరమణ ఉందనగా లంచం తీసుకుంటూ దొరికిపోవడం గమన్నరహం. అదుపులోకి తీసుకున్న అధికారులు వరంగల్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని తెలిపారు.
-----------------------
Reporter